చండూరులో దివ్యాంగుల ఉపకరణాల ఎంపిక శిబిరం

*దివ్యాంగులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
*ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుండి.
*రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఉపకరణాలు పంపిణీ చేస్తాం .
*చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 01: అలిమ్కో – హైదరాబాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని గురువారం చండూరులో నిర్వహించారు.కస్తాల రోడ్డులోని భారతి చంద్ర గార్డెన్ లో జరిగిన ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ శిబిరంలో అర్హులైన దివ్యాంగులను గుర్తించి బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, శ్రవణ యంత్రాలు, చంక కర్రలు, బ్రెయిలీ కిట్లు, స్మార్ట్ కేన్లు తదితర ఉపకరణాల కోసం దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ… దివ్యాంగులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది.

“దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.

అర్హులైన ప్రతి దివ్యాంగుడు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉపకరణాలు అవసరమైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. మున్సిపాలిటీ తరపున మీకు పూర్తి సహకారం అందిస్తాం. రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఉపకరణాలు పంపిణీ చేస్తాం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు, అలిమ్కో అధికారులు, మున్సిపల్ సిబ్బంది, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News