ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు యువత చెక్ పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పారు.