వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 19, ప్రతిపక్షం: వనపర్తి జిల్లా, రాజాపేట గ్రామానికి చెందిన గద్వాల గోవింద్ తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ లో జూనియర్ సివిల్ జడ్జి (JCJ) గా ఎంపికైయ్యారు.ఈ సందర్భంగా గద్వాల గోవింద్ కు హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ మరియు మిత్ర బృందం కలిసి ఉస్మానియా క్యాంపస్ లో ప్రత్యేకంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి కష్టపడి చదివి, న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానం సాధించిన గోవింద్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు.స్వామి వివేకానంద స్ఫూర్తితో, డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో న్యాయవిద్యలో ప్రతిభ కనబర్చి, ఎంతో కృషి మరియు పట్టుదలతో ఈ ఘనత సాధించారు. గోవింద్ విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన న్యాయస్థానంలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మిత్రులు, అడ్వకేట్లు రవి, భైరవ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.





























