[t4b-ticker]

మోహన్ లాల్ స్పీడ్.. మన సీనియర్ హీరోలకు సాధ్యమేనా?

ప్రతిపక్షం, ఆగస్టు 19: ఒకేసారి ఏకంగా ఏడు సినిమాలను ప్రకటించి సీనియర్ హీరో మోహన్ లాల్ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. వరుస ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉండటం మలయాళ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. అయితే టాలీవుడ్ సీనియర్ హీరోల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.

చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ ఇమేజ్, ఎక్కువ సమయం తీసుకునే షూటింగ్, అభిమానుల అంచనాలు వంటి కారణాలతో సినిమాల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికైనా హీరోయిజాన్ని కొంత పక్కనపెట్టి కథకు, పాత్రకు ప్రాధాన్యతనిచ్చే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెడితే సీనియర్ హీరోలు మరిన్ని చిత్రాలు చేసే అవకాశం ఉంటుందని పలువురు సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటే ఒకే తరహా పాత్రల నుంచి బయటకు రావడంతో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించవచ్చని అంటున్నారు.

మోహన్ లాల్ తరహాలో వరుస సినిమాలతో ముందుకు సాగడం మన సీనియర్ హీరోలకు సాధ్యమేనా? లేక ఏడాదికి ఒకటి, రెండు సినిమాలే చేస్తూ నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదా? మీరేమంటారు?

Spread the love

Related News

Latest News