[t4b-ticker]

చండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతుకు ఆర్థిక సహాయం అందించాలి!

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 02 : వర్షాభావ పరిస్థితులు, పంటల నష్టం కారణంగా నల్లగొండ జిల్లా చండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం చండూరు లో పంట చేలను పరిశీలించి అయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… సకాలంలో వర్షాలు పడక పోవడంతో సాగు పూర్తిగా దెబ్బతిన్నదని, మండలం లోని అన్ని గ్రామాలలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవకా పంట చేలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నెలకొందని, వరి నారుమడులు, పత్తి చేను ఊడ పిందె దశకు వచ్చి పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కరువు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ. 20వేల చొప్పున రైతులకు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. రైతులు ఆరు కాలం కష్టం చేసిన నెర్రెలు పారిన నేలలు, నీరు లేక కరువు వచ్చి, పెట్టిన పెట్టుబడి తీర్చలేక ఇబ్బంది పాలైన రైతులను ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News