•అయన సేవలు చిరస్మరణీయం
•వైఎస్సార్ ను స్మరించుకున్న డీసీసీ చీఫ్ శివసేనరెడ్డి
•మాజీ సీఎం రాజ శేఖర్ రెడ్డి విగ్రహానికి ఘన నివాళి
వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 02(ప్రతిపక్షం): దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వనపర్తి డీసీసీ చీఫ్, శివసేనరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా శివసేనరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేసిన ప్రజా నాయకుడని కొనియాడారు.ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు వైఎస్సార్ నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు.ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలవడమే వైఎస్సార్ రాజకీయ జీవితానికి ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఆయన ఆశయాలు, ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందన్నారు.వైఎస్సార్ చూపిన ప్రజాసేవా మార్గాన్ని కొనసాగిస్తూ పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని శివసేనరెడ్డి అన్నారు.వైయస్సార్ అందించిన సంక్షేమాన్ని నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగూడెం సర్పంచ్ పుష్పలత శివకుమార్, మండల అధ్యక్షులు నక్క రవి కిరణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, గ్రామ అధ్యక్షుడు గుండ్రాల రాములు, కాంగ్రెస్ నాయకులు కొండన్న యాదవ్, శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బుచ్చిబాబు, రొయ్యల రమేష్, రవి, బాలరాజు, శ్రీనివాసులు, చిన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు పాండు సాగర్, శివ కుమార్ నాయుడు, రోహిత్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.






























