కేటీఆర్, హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి విమర్శలు

ప్రతిపక్షం, జూలై 02: రాష్ట్ర అప్పుల అంశంపై కొనసాగుతున్న రాజకీయ వివాదంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సవాళ్లు విసిరి చివరకు వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ నాయకుల వైఖరిగా మారిందని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసి అసెంబ్లీలో చర్చకు సిద్ధమైందని, కానీ ఆ సమయంలో ప్రతిపక్షం వాకౌట్ చేసిందని పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పుడు గన్‌పార్క్ వద్ద బహిరంగ చర్చకు కూడా రాకపోవడం వారి వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు.

అలాగే, బీఆర్ఎస్‌లో అంతర్గత ఆధిపత్య పోరాటాల కారణంగానే ఇలాంటి రాజకీయ డ్రామాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని మంత్రి పొంగులేటి తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News