Trending Now

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..

ప్రతిపక్షం, హుస్నాబాద్ : ఎలాంటి ప్యాకింగ్ లేకుండా 29 బ్యాగులు ఒక్కొక్క బ్యాగులొ 50 కేజీల ఉన్న నకిలీ విత్తనాలను పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 1450 కేజీలు సుమారు 35 లక్షల రూపాయల విలువ గల నకిలీ విత్తనాలను నిందితులు పిండి సురేష్, వేలేరు జిల్లా హన్మకొండ సతీష్ నండి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మదాపూర్ గ్రామంలో ముక్కెర మల్లయ్య ఇంటిలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు ఇంటిపై రైడ్ చేయగా.. 50 కేజీలు ఉన్న 29 బ్యాగులను పట్టుకొని పరిశీలించారు. దీంతో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కేజీల బ్యాగులల్లో ఉన్న నకిలీ పత్తి విత్తనాలు పై నిందితులిద్దరూ కలసి నిలువ చేసి ఉంచారని పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఏ షాపులో కొన్న తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో విడి విత్తనాలు ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లైతే.. వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ : 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love