Trending Now

మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ తెలిపారు. గాంధీ భవన్ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ పరివార్‌లో నేరస్తులే ఉన్నారని.. మోడీ పరివార్లు అంతా అదానీ, అంబానీ దేశ సంపదను దోచుకున్నారని బీజేపీపై ఆమె ఫైరయ్యారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పాంచ్ న్యాయ, పచ్చీసు గ్యారంటీలను అమలు చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా కోసం మహాలక్ష్మి రూ. 500 రూపాయలకు గ్యాస్, ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవన్న వేల మంది మహిళల ను బలత్కారం చేశారు. వారి వీడియోలను చిత్రీకరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రజ్వల్ రేవన్న కోసం ప్రధాని మోడీ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని.. మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ కుటుంబానికి లోక్ సభ సీటును బీజేపీ ఇచ్చిందన్నారు.

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలను వంటింటికే పరిమిత చేయాలని ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర చేస్తుంది. తెలంగాణ మహిళలు చైతన్యవంతులు.. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మహిళలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఆమె పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News