ప్రతిపక్షం, జూన్ 01: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్యారడైజ్ సినిమాపై ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం పూర్తైన తర్వాత, శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ రెండు సినిమాల కథలకు ఒక ప్రత్యేక అనుసంధానం ఉండొచ్చనే చర్చ టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. ‘ప్యారడైజ్’ క్లైమాక్స్‌లో చిరంజీవి నటించనున్న తదుపరి చిత్రానికి సంబంధించిన లీడ్ లేదా ప్రత్యేక హింట్ ఇవ్వనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా, ‘ప్యారడైజ్’ కథను భవిష్యత్తులో విస్తరించేలా సీక్వెల్‌కు సంబంధించిన సంకేతాలు కూడా క్లైమాక్స్‌లో ఉండొచ్చని సమాచారం. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో పాటు చిరంజీవి ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అధికారిక వివరాలు వెలువడే వరకు ఈ వార్తలను కేవలం ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది.

















