రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా మెదక్ లో ధర్నా నిరసన

ప్రధానమంత్రి, కేంద్ర విద్యా శాఖ మంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 22: విద్యార్థులు తమ న్యాయమైన సమస్యల సాధన కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడితే విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అప్రాజస్వామికమని వారికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలో కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహం పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వినాలే తప్ప, బలప్రయోగంతో నిరసనలను అణచివేయకూడదని సూచించారు.

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలు, నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చ నిర్వహించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన ఘటనలపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, నీట్‌ పేపర్‌ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా పారదర్శక పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం కాంగ్రెస్ నేతలను మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో. మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. కౌన్సిలర్ తుడుపునూరి రామకృష్ణ.మాజీ సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు భూపతి రాజ్.గంగాధర్. చంద్రపాల్. బొజ్జ పవన్ భరత్ గౌడ్ మహేందర్ రెడ్డి లక్ష్మీనారాయణ గౌడ్. గంగాధర్ సుభాష్ చంద్రబోస్ జిల్లా మైనార్టీ చైర్మన్ సూఫీ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News