ప్రైవేటు స్కూళ్లపై ఫిర్యాదులు.. ఫీజులపై విజయ్ కీలక నిర్ణయం

ప్రతిపక్షం, జూన్ 03: ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి స్కూల్ నోటీస్ బోర్డులో ఫీజు నిర్మాణాన్ని స్పష్టంగా ఉంచాలని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు అడ్మిషన్ ఫారాల్లో కూడా ఫీజు వివరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే గుర్తింపు రద్దు చేసే వరకు వెళ్లుతామని అధికారులు హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News