Trending Now

నిర్మల్‌లో ఏఐ ఎంఐఎం సంబరాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 5 : ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 5వ సారి ఎంపీగా ఘన విజయం సాధించడం పట్ల ఏఐఎంఐఎం శాఖ ఆధ్వర్యం లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం నిర్మల్ శాఖ అధ్యక్షులు అజీం బిన్ యహియా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో కష్టపడ్డ, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ పార్లమెంటరీగా రెండుసార్లు పురస్కారం అందుకున్న అసదుద్దీన్ ఓవైసీ లాంటి రాజ నీతిజ్ఞుడు ఈ నూతన ప్రభుత్వంలో అత్యంత అవసరమని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని వర్గాల సమా న్యాయం,సమా సంక్షేమం కోసం రాజ్యాంగ విధి విధానాలకు అనుగుణంగా పార్లమెంట్ లో గళం విప్పి ప్రభుత్వాలను నిలదీసే సత్తా సామర్థ్యం ఒక అసదుద్దీన్ ఓవైసీకే ఉందన్న విషయాన్ని సమాజం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ ముజాహిద్ అలీ, సయ్యద్ అబ్రారుల్ హసన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మజహర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రఫీ అహ్మద్ ఖురేషి, అబ్దుల్ జబ్బార్, గఫార్, తయ్యబ్ బిన్ సలా, మహమ్మద్ ఇఫ్తేఖారోద్దీన్ అన్సారి, శేఖ్ జుబేర్, శేఖ్ అర్బాస్, సయ్యద్ సల్మాన్, శేఖ్ ఫెరోజ్, పైజాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News