AP Cabinet meeting: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో కీలకమైన ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. ప్రధానంగా మహిళలకు ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉండనుంది.
అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక రంగంపై 5 నుంచి 6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం.