వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ మరో సెంచరీ

ప్రతిపక్షం, జూన్ 24: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. స్థానిక మ్యాచ్‌లో కేవలం 119 బంతుల్లో 168 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.

ఈ భారీ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 6 సిక్సర్లు బాదిన ఆశీర్వాద్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అతడి బ్యాటింగ్ శైలి అన్న వైభవ్ సూర్యవంశీని గుర్తు చేస్తోందని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విషయాన్ని వైభవ్ తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడంతో అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. “అన్న సెంచరీకి చేరువలో ఆగిపోతుంటే.. తమ్ముడు మాత్రం వరుసగా శతకాలు బాదుతున్నాడు” అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.

Spread the love

Related News

Latest News