ప్రతిపక్షం, జూలై 18: రాజమౌళి–మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ప్రియాంకా చోప్రా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఆమె పాత్రకు సంబంధించిన రెండు కొత్త ఫొటోలను అంతర్జాతీయ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో ఒక పోస్టర్‌లో ప్రియాంకా చోప్రా ‘మందాకిని’ లుక్‌లో కనిపించగా.. మరో పోస్టర్‌లో పూర్తిగా చిల్ మోడ్‌లో దర్శనమిచ్చారు. ఈ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

















