ప్రతిపక్షం, ఖమ్మం: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ విద్యావంతులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జి సెంటర్లు త్వరలో ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిష్ణాతులైన వారితో ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. వీటి ఏర్పాటు వల్ల శిక్షణ కోసం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదని ఖమ్మం జిల్లా ముదిగొండలో చెప్పారు.