- భోజనం, చదువు, క్రీడలు ప్రతి విద్యార్థి దినచర్యలో ఉండాలి. సాధన ద్వారానే మంచి భవిష్యత్
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 25: విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.శనివారం జిల్లాలోని చేగుంట మండల పరిధిలో గల కేజీబీవీని కలెక్టర్ సందర్శించారు.ముందుగా 06,07 తరగతుల విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు, 08 వరకు టేబుల్స్ చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం 10వ తరగతిలో అన్ అకాడమీ తరగతులను పరిశీలించారు, ఫాస్ట్ మ్యాథ్స్, GET IT WRITE పుస్తకాల ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు.కొన్ని కంప్యూటర్లు మరమ్మతులు గురి కాబడినవని కలెక్టర్ తెలుసుకొని వెంటనే బాగు చేయించి అందరికీ ఆన్ అకాడమీ అందుబాటులో తీసుకురావాలన్నారు. వంట గదిలోకి వెళ్లి, , వంట సరకులను, సిద్ధం చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు.
డైట్ చార్ట్ ప్రకారం వంటలు చేశారా? లేదా? అని అడిగి, ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? కలెక్టర్ ఆరా తీశారు.కేజీబీవీ పరిసరాల చుట్టూ పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని, ఎలాంటి చెత్తచెదారం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ను కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేజీబీవీ లలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.అందరికీ అన్ని అంశాలు తెలియదని, ప్రతిరోజూ చదివితే తెలియని అంశాల మీద పట్టు సాధించవచ్చన్నారు.ప్రతి పోటీ పరీక్షలో మ్యాథ్స్ తప్పనిసరిగా ఉంటుందని, ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకంలోని అంశాలను నేర్చుకుంటే గణితంలో ఉండే లెక్కల సాధన సులభ తరం అవుతుందని యూట్యూబ్ వీడియోల కంటే అన్ అకాడమీ తరగతులు చాలా ఉపయోగ పడతాయన్నారు.ప్రణాళికా ప్రకారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అన్నీ బోధించాలన్నారుసమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులు ఆదేశించారు .ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, బి డబ్ల్యు ఓ హేమా భార్గవి, ఎంపీడీవో చెన్నారెడ్డి,గణాంక అధికారి నవీన్ కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





















