Trending Now

Rahul Gandhi: కంగనా రనౌత్‌పై వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi fire Kangana Ranaut statements: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021లో రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో మళ్లీ దుమారం రేపాలని అనుకుంటుంటున్నారా?అంటూ మండిపడ్డారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విధానాలను ఎవరు నిర్ణయిస్తున్నారు? మోదీనా? బీజేపీ ఎంపీనా? అని కంగనాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. . రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చేసే కుట్రలను ‘ఇండియా’ కూటమి అనుమతించదన్నారు. ఒకవేళ రైతులకు కీడు చేకూర్చే చర్యలు తీసుకుంటే.. ప్రధాని మరోసారి క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Spread the love

Related News