నకిలీ డెత్ సర్టిఫికెట్ తో కారుణ్య ఉద్యోగం – 14 మంది అరెస్ట్ – ఎస్పీ శరత్ చంద్ర పవార్.

*రూ.13 లక్షల ఒప్పందం – రూ.5 లక్షలు స్వాధీనం

*మూడు శాఖల అధికారుల చుట్టూ ఉచ్చు.

ప్రతిపక్షం, నవంబర్ 08, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి సహా 14 మందిని అరెస్ట్ చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
కేసు వివరాలు: http://Cr.No.299/2026, U/S 318(4), 336(3), 338, 340(2), 61(2), 212(A), 236, 237 BNS, 65 IT Act, Sec.36 Aadhaar Act, 25/Register of Birth, Death Act కింద 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

శాలిగౌరారం PHCలో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 31-05-2025న పదవీ విరమణ పొందారు. కిడ్నీ సమస్యతో 17-11-2025న మరణించారు. 26-11-2025న ఒగోడులో దశదిన కర్మలు జరిగాయి.

*మోసానికి పన్నిన కుట్ర:

మృతుడు సర్వీసులో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే, ఆయన కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందని నిందితులు పథకం వేశారు. ఈ కుట్రలో మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు, బంధువులు రాజశేఖర్, రవీందర్, PHC సీనియర్ అసిస్టెంట్ జగన్నాథరెడ్డి, వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. DMHO కార్యాలయంలోని CC పోలె రంజిత్ కుమార్ ను సంప్రదించి రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.

*ఆధార్ చిరునామా మార్పు – నకిలీ సర్టిఫికెట్:

నల్లగొండలోని మీ సేవా నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ @ చందు ద్వారా మృతుడి ఆధార్ లో చిరునామాను DVK రోడ్, చైతన్యపురి కాలనీ, వార్డు నం.10, ఇంటి నం.500/1 గా మార్చారు. ఈ తప్పుడు ఆధార్ తో 28-05-2025న మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుండి నకిలీ డెత్ సర్టిఫికెట్ పొందారు. దరఖాస్తుపై PGSP కానిస్టేబుల్ కట్ల సతీష్ ను సాక్షిగా పెట్టారు. వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, మీ సేవా AO రాజశేఖర్, చందు కుమ్మక్కై ఈ సర్టిఫికెట్ ఇప్పించారు.

*వైద్య శాఖ అధికారుల పాత్ర:

నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా శాలిగౌరారం PHC మెడికల్ ఆఫీసర్ డా.ఆకుల కృష్ణ సూర్య శిల్ప ఫైల్ ను DMHO కార్యాలయానికి పంపారు. అక్కడ సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్, జూనియర్ అసిస్టెంట్ మోహన్ కృష్ణ, AO మహబూబ్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, CC రంజిత్ కుమార్, PHC సీనియర్ అసిస్టెంట్ జగన్నాథరెడ్డి తప్పుడు విచారణ నివేదికలు తయారు చేసి DMHOకు సమర్పించారు. దీంతో చామకూరి రాజుకు దామరచర్ల PHCలో ఉద్యోగం వచ్చింది.

*స్వాధీనం చేసుకున్నవి: నగదు రూ.5,00,000, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, 12 సెల్ ఫోన్లు, మృతుడి ఫోటో.

*అరెస్ట్ అయిన 14 మంది వివరాలు:

  1. చామకూరి వసంత, నకిరేకల్2. చామకూరి రాజు, నకిరేకల్3. చామకూరి రాజశేఖర్ – కలెక్టరేట్ AO (పరారీలో)4. చామకూరి రవీందర్, హెల్త్ అసిస్టెంట్, కేతేపల్లి (పరారీలో)5. కంచర్ల జగన్నాథరెడ్డి, సీనియర్ అసిస్టెంట్, శాలిగౌరారం PHC6. రాచకొండ వెంకటేశ్వర్లు @ వెంకట్ గౌడ్, ఒగోడు7. డా.ఆకుల కృష్ణ సూర్య శిల్ప, MO, శాలిగౌరారం8. పనస చంద్రశేఖర్ @ చందు, మీ సేవా నిర్వాహకుడు9. కట్ల సతీష్, కంప్యూటర్ ఆపరేటర్, TGSP10. ముక్కమొయిల శివ జనార్ధన్, వార్డు ఆఫీసర్, నల్లగొండ11. ఎన్. ప్రదీప్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, నల్లగొండ మున్సిపాలిటీ12. పోలె రంజిత్ కుమార్, జూనియర్ అసిస్టెంట్, DMHO ఆఫీస్13. నాగిరెడ్డి జితేందర్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్, DMHO ఆఫీస్14. మహబూబ్ అలీ, AO, DMHO ఆఫీస్, నల్లగొండ15. గింకల రాకేష్ యాదవ్, సీనియర్ అసిస్టెంట్, DMHO ఆఫీస్16. తుంగతుర్తి మోహన్ కృష్ణ, జూనియర్ అసిస్టెంట్, DMHO ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు తేదీ 04-11-2026న 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో DSP కె.శివరామిరెడ్డి పర్యవేక్షణలో CI కె.ఆది రెడ్డి, SIలు బి.శివప్రసాద్, డి.సైదాబాబు, ఎన్.వెంకట్ నారాయణ, జె.సైదులు బృందం ఈ మోసాన్ని ఛేదించింది.

Related News

Latest News