రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు చౌరస్తా నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు పురుషులకు ఐదు కిలోమీటర్ల రన్నింగ్, అలాగే మెదక్ కొత్త బస్టాండ్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు బాలికలకు రెండు కిలోమీటర్ల రన్నింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండాతో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. మన మెదక్ జిల్లాలో జాతీయ క్రీడ దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. క్రీడాకారుల విద్యార్థులు జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడలలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడ లభిస్తాయి అన్నారు.
అనంతరం ధ్యాన్చంద్ చౌరస్తా వద్ద ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు జుబేర్ అహ్మద్ , స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శివ,డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్, ,పాల్గొని ధ్యాన్చంద్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం క్రీడాకారులు క్రీడాభిమాను ఉద్దేశించి వక్తలు తమ సందేశాలను వినిపించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, సమష్టి తత్వం పెంపొందించడమే లక్ష్యంగా పురుషులకు ఐదు కిలోమీటర్ల, బాలికలకు రెండు కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదగా మెడల్స్ అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు,మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమైక్య కార్యదర్శి నాగరాజు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆనందం,ఫుట్బాల్ కోచ్ వినయ్, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు పాల్గొన్నారు.






























