[t4b-ticker]

నేపాల్‌లో వరదలు.. 626 దాటిన మృతుల సంఖ్య

ప్రతిపక్షం, ఆగస్టు 29: నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 626కు చేరినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. మరోవైపు సుమారు 2,500 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఆహారం, తాగునీరు, వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా 8,791 మంది పోలీసులు రంగంలోకి దిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో మరోసారి నేపాల్‌లో తీవ్రస్థాయిలో వరదలు వచ్చే అవకాశం ఉందని చైనా హెచ్చరించింది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ సహాయక, రక్షణ చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News