[t4b-ticker]

వనమహోత్సవంలో మొక్కలు నాటిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, ఆగష్టు 20: నిజామాబాద్‌లో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వనమహోత్సవంలో భాగంగా మల్లారం గండి వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News