చార్మినార్ ఏసీపీ కుటుంబంలో విషాదం.. భార్య హేమలత ఆత్మహత్య

ప్రతిపక్షం, జూలై 13: హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) చంద్రశేఖర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య హేమలత అల్వాల్‌లోని తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, హేమలత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పోలీసులకు వివరించినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హేమలత ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love

Related News

Latest News