ప్రతిపక్షం, జూలై 07: మాజీ మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. హిమాన్షుకు నిన్న సాయంత్రం స్వల్ప గాయం (మైనర్ ఇంజ్యూరీ) అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
మరికొన్ని రోజుల్లో హిమాన్షు పూర్తిగా కోలుకుంటాడని కేటీఆర్ పేర్కొన్నారు. అతని ఆరోగ్యం గురించి ఆరా తీసిన పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా, హిమాన్షును పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఇప్పటికే పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి వెళ్లి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
హిమాన్షు త్వరగా కోలుకోవాలని పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

















