Trending Now

అదిలాబాద్ ఎంపీ సీట్ గెలిపే లక్ష్యంగా మంత్రి సీతక్క నిత్య కష్టాలు..

ద్విచక్ర వాహనం ఎక్కి ఉపాధి కూలీలకు ఎన్నికల ప్రచారం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ మే 9 : అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఉత్కంఠ భారీతంగా కొనసాగుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా దీనికి చాలెంజ్ తీసుకొని తమదైన శైలిలో నిత్య ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ అగ్రస్థాయి నేతలు తమ తమ పార్టీల ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సభలు సమావేశాలు రోడ్ షో లు నిర్వహించి ప్రచారాలను నిర్వహించగా గ్రామాలు వీధులు, పోలింగ్ బూత్‌ల వారిగా తమ పార్టీల ఎంపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ఆదేశాలు, సూచనల మేరకు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా సుమారు నెల రోజులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క పార్టీ ఆదేశాలు సూచనలను అనుసరిస్తూనే తనదైన రీతిలో ప్రణాళిక రూపొందించుకొని ఓటర్లను ఆకర్షించే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పదేళ్ల బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలు, బిజెపి చాందసవాద అవినీతి అక్రమాలు ఇతరత్రా వాటిపై, బీఆర్ఎస్ భూకబ్జాలు అవినీతి అక్రమాలు మోసాలపై ప్రజలలో తనదైన శైలిలో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూనే నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం వడ్యాల్, పీసర గ్రామాలలో మండుటెండలు ద్విచక్ర వాహనంపై జాతీయ ఉపాధి హామీ కూలీలను వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆదివాసి పేద ఆడబిడ్డ ఆత్రం సుగుణకు ఓటు వేసి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ని చేసుకుందామని వేడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేతు గుర్తుకు ఓటు వేస్తేనే మళ్లీ ఇంద్రమ్మ రాజ్యం సుస్థిర పాలన అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం జరుగుతున్న అంటూ వారిలో భరోసా కల్పించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోగా చదువుతూ.. వారికి వారి భాషలోనే సముదాయించే ప్రయత్నం చేశారు. ఆమె వెంట నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News