ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం జరిగిన అనకాపల్లి సభ తర్వాత జ్వరం రావడంతో ఇవాళ యలమంచిలి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతుండగా.. పవన్ ప్రచారం పైనే ఆశలు పెట్టుకున్న నేతలకు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయారు.