Trending Now

ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళి..

అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆనాడు కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనాటి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జరిపిన కాల్పులలో అమాయకుల ప్రాణాలు పిట్టల్ల రాలిపోయాయని అన్నారు. ఆదివాసుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం పాటు పడుతుందని, ఎప్పుడు లేని విధంగా గిరిజనుల సంక్షేమం కోసం రూ.1.24 వేల రూపాయల నిధులను బడ్జెట్ లో కేటాయించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల కాల్పుల్లో అమరులైన గిరిజనులు..

1981, ఏప్రిల్‌ 20న ‘భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం’.. ‘మా ఊళ్లో మా రాజ్యం’ అనే నినాదంతో రైతు కూలీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు ఉద్యమకారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఎందరో గిరిజనులు అమరులయ్యారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్‌ 20న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్మించిన అమరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Spread the love

Related News