కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అసిత్ నాథ్ తివారీ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్‌కు పంపించారు. రాజీనామాకు కారణం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన లేఖలే పేర్కొన్నారు.

Related News

Latest News