ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్లారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని పవన్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. మోదీ ప్రభుత్వంలో వారణాసి అభివృద్ధి చెందిందని పవన్ తెలిపారు.
వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ..
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బీజేపీ తరఫున వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కాగా, వారణాసిలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది.
వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొననున్న పవన్..?
ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. ఈక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరిగి సినిమా షూటింగ్స్‌లో ఎప్పుడు పాల్గొంటారనే అంశంపై నెట్టింట చర్చ మొదలైంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న OG, హరీశ్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చిన తర్వాత జూన్ చివరి వారంలో OG షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాల సమాచారం.