మెట్రోను అడ్డుకునే అవసరం కిషన్‌రెడ్డికి లేదు.. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్

ప్రతిపక్షం, జూన్ 16: తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలను ఖండించారు. మెట్రో విస్తరణను అడ్డుకోవాల్సిన అవసరం కిషన్‌రెడ్డికి లేదని, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) అంశంపై కాంగ్రెస్ పార్టీ అనవసర గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయుల ఓట్లపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

మావోయిస్టుల అంశంపై స్పందించిన బండి సంజయ్, తుపాకీ మార్గంలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని అన్నారు. హింస వల్ల అమాయకుల ప్రాణాలు బలయ్యాయని, చివరకు మావోయిస్టు ఉద్యమం నిషేధానికి గురైందని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారని, హింసాత్మక భావజాలాన్ని విడనాడాలని యువతకు సూచించారు.

Spread the love

Related News

Latest News