Trending Now

మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్‌గా మోడీ..

ప్రతిపక్షం, నేషనల్: మరికొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ మీడియా సంస్థ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’.. అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితాను విడుదల చేసింది. ‘ఐఈ- 100: 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారు. రాజకీయం, వ్యాపారం, క్రీడలు, సినిమా వంటి అన్ని రంగాల్లో కలిపి ఈ నివేదికను రూపొందించగా.. ప్రధాని మోడీ మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్‌గా నిలిచారు.

సినిమాల్లో షారుఖ్, క్రీడల్లో కోహ్లీ..

మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉండగా, అసోం సీఎం హిమంత శర్మ(14వ స్థానం), బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(15), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(16), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(18), ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్(19), రిలయన్స్ చైర్‌పర్సన్ నీతా అంబానీ(26), బాలివుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (27), కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ (29), బీసీసీఐ సెక్రెటరీ జై షా (35), కాంగ్రెస్ చీఫ్ ఖర్గే (36), టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(38), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (39), మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర(43), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (49) ఉన్నారు. ఈ జాబితాలో రాహుల్ గాంధీ(16), సోనియా గాంధీ(29)ల కంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(15) మెరుగైన స్థానంలో ఉండటం గమనార్హం. ఇక, సినిమా రంగంలో బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(27), క్రీడారంగంలో విరాట్ కోహ్లీ (38) 50లోపు స్థానాలకు దక్కించుకుని తమ తమ రంగాల్లో వారికి తిరుగులేదనిపించుకున్నారు.

Spread the love

Related News