Trending Now

ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం..

అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గం ఇంచార్జ్ శ్రావణ్ కుమార్ రెడ్డి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ఇచ్చిన ఐదు గ్యారెంటీలను 100% అమలు చేసి తీరుతుందని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ శ్రావణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని దశలవారీగా అమలు చేస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళుతున్నదని చెప్పారు. అదే మాదిరి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మేనిఫెస్టో పొందుపరిచిన 5 గ్యారంటీలను కూడా పక్కాగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.

కేంద్రంలో పదేళ్ల మోడీ, రాష్ట్రంలో కేడీల పాలనను ప్రజలు గమనించారని వారి ఆగాడాలకు చరమా గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దేశానికి విద్య, వైజ్ఞానిక, సామాజిక, ఆర్థిక ఇతర రంగాలలో జరిగినటువంటి అభివృద్ధి 15 ఏళ్లుగా జరగడం లేదన్న విషయాన్నిప్రజలు గుర్తించాలన్నారు. సబ్కా సార్ సబ్కా వికాసం.. అంటూనే దేశంలోని అల్ప సంఖ్యకులను అణగదొక్కేలా అనేక క్రూరమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు అన్ని ప్రాంతాలలో చేపడుతున్నారని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరికీ ఒకే నాయం ఒకే సంక్షేమం దిశగా ముందుకు వెళ్తుందని చెప్పారు. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్‌కు విషెస్ స్పందన లభిస్తుందని.. ఈసారి ఆదిలాబాద్ లో మూడు రంగుల జెండా ఎగరవేయడం లక్ష్యంగా బూత్ ల వారీగా ప్రతి ఒక్కరు కష్టపడాలని ఆయన సూచించారు.

నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో బూత్ ల వారిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళుతున్నదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు నిండగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునిగా ఈ 20 రోజులు కష్టపడి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. ముధోల్ ,ఖానాపూర్ ,నిర్మల్, నియోజకవర్గాల వారిగా పట్టణ గ్రామీణ స్థాయి ఎన్నికల బూత్ కేంద్రాలను బూతుల వారీగా ఓటర్ల సంఖ్యను కాంగ్రెస్ కు పడే ఓటుల శాతము ఓటర్ల సంఖ్య తదితర విషయాలపై క్షేత్రా స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు కష్టపడుతున్నారని ఈ సందర్భంగా వివరించారు.

ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి జిల్లా పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి సత్తు మల్లేష్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, నిర్మల్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షులు నాందేడ్ నాందెడపు చిన్ను, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అయ్యన్న గారి పోశెట్టి. కొట్టే శేఖర్, గాజుల రవి అరవింద్ కుమార్ కొంత గణేష్, మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి, సాదా సుదర్శన్, పద్మాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News