Trending Now

ఆరు గ్యారంటీలు అమలు చేస్తే.. రాజీనామాకు సిద్ధంగా ఉన్నా..

జల దృశ్యంలో ఎగిరిన గులాబీ జెండా ప్రస్థానం..

దేశానికి తెలంగాణ ఆదర్శం..

పార్టీ ఆవిర్భావ వేడుకలలో మాజీ మంత్రి హరీష్ రావు..

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 27: ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2001 ఏప్రిల్ మాసంలో హైదరాబాద్ లోని జల దృశ్యం తో గులాబీ జెండా ప్రస్తానం ప్రారంభమై, నేడు దేశానికి ఆదర్శం అయిందన్నారు.కొనాయి పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి మూడింటికి రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభం చేశామన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందనీ గుర్తు చేశారు. రైతు బంధు పథకాన్ని కేంద్రంలోనీ బీజేపీ కాపీ కొట్టి అమలు చేసిందన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారనీ విమర్శించారు.రేవంత్ రెడ్డి పథకాల అమలు పై దృష్టి పెట్టలేక బిఆర్ఏస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడనీ విమర్శించారు.ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాను రాజీనామా చేస్తానన్న అని తెలిపారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి అయితే రాజీనామా కోసం జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి సొల్లు మాటలు చెప్పడం కాదు.. సీదాగా సూటిగా మాట్లాడలానీ సూచించారు. మొదట రేవంత్ రెడ్డి స్పీకర్ పార్మట్ లో ప్రెస్ అకాడమీ చెర్మెన్ శ్రీనివాస్ రెడ్డి కి రాజీనామా పత్రం పంపిస్తే, తాను 5 నిముషాల్లో పంపిస్తాననీ వ్యాఖ్యానించారు. తనకు పదవులు ముఖ్యం కాదనీ రైతులు, ప్రజల ప్రయజనాలు ముఖ్యం అని తెలిపారు. గతంలో ఓటు కు నోటు లో అడ్డంగా దొరికి నేడు దేవుళ్లపైన ఒట్లు వేస్తున్నడని హెద్దేవ చేశారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఇచ్చిన గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో చెప్పలని డిమాండ్ చేశారు. తాను రుణమాఫీ చెయ్యాలని అడుగుతే కాంగ్రెస్ మంత్రులు నన్ను తిడుతున్నారనీ మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల తిట్లను గమనిస్తున్నారనీ, హామీలు అమలు అయ్యే వరకు తాను పోరాటం చేస్తునే ఉంటానని అన్నారు. రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలను ఉడగోట్టాలని చూస్తున్నారనీ, జిల్లాలు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలనీ ప్రజలను కోరారు.

Spread the love

Related News

Latest News