Trending Now

గ్రూప్ -1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి..

నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 26 : గ్రూప్ -I పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆయన గ్రూప్-I పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా సరిపడినంత ఫర్నిచర్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఉండాలని సూచించారు. పరీక్ష జరిగే సమయంలో పరిక్షా కేంద్రానికి 200 మీటర్ల లోపు జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ పత్రాల తరలింపు సమయంలో పోలీసు శాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రతి పరీక్ష కేంద్రంలో పోలీసు భద్రతను కల్పించాలని అన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కలుగకుండా నిరంతరం సరఫరా చేయాలనీ విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎటువంటి వైద్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అత్యవసర వైద్య సిబ్బంది మందులు, ఓఆర్ఎస్ పాకెట్స్ లను అందుబాటులో ఉంచాలని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నిర్మల్, బైంసా ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News