Trending Now

రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారాలు..

పట్టింపులేని పురపాలక, పోలీస్ శాఖల అధికారులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 1: అది సాక్షాత్తు జిల్లా కేంద్రం.. అక్కడ ప్రతిరోజు పరిసర పట్టణాలు పల్లెల నుంచి వేలాది మంది వస్తూ పోతూ ఉంటారు వీటికి తోడు వాహనాల రాకపోకలు కూడా అదే సంఖ్యలో ఉంటాయి. ఉన్న అంతర్గత ప్రధాన రహదారులన్నీ దుకాణ యజమానుల రోజు వారి సామాగ్రి తోపుడు బండ్లు చాటుబండ్లు ఇతరత్రా వాటితోనే ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఆయన ఇటు పోలీసు యంత్రాంగం గాని అటు పురపాలక సంఘం అధికారులు పాలకులు గాని పట్టించుకోకపోతుండడంతో సదరు దుకాణ యజమానులు తోపుడుబండ్ల వారు తమదే రాజ్యాంగా రోడ్లపైనే తమ వ్యాపారాలను కొనసాగిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదు సాక్షాత్తు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన అంతర్గత వీధులలో ఉన్న రోడ్లపై నడవడమే నరకంగా మారింది జిల్లా కేంద్రం అయిన తర్వాత నిర్మల్ లో ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపం దాల్చి స్థానికులు నిత్యం పడరాని పాటలు పడుతున్నారు దీనికి తోడు నిర్మల్ పట్టణంలోని పింజారి గుట్ట బుధవార్ పేట్ జామా మసీద్ చౌరస్తా ఓల్డ్ అశోక్ థియేటర్ చౌరస్తా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తా, మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌరస్తా, వివేకానంద చౌరస్తా ఇంద్రానగర్ చౌక్ తదితర ప్రాంతాలలో ఉన్న ఆయా రకాల వ్యాపారస్తులు తమ వ్యాపారాలకు సంబంధించిన వినియోగ ఇతర సామాగ్రాలను సుమారు రోడ్లపైకి పది నుంచి పదిహేను ఫీట్ల వరకు పెట్టిస్తున్నాడంతో అటు గుండా వెళ్లడమే నరకంగా మారుతుంది. ముఖ్యంగా సదరు ప్రాంతాలలో ఉన్న శాశ్వత తాత్కాలిక దుకాణ సముదాయాలలో అద్దెకుంటున్న వ్యాపారులు తాము అద్దెకు ఉన్న మనకే 10 నుంచి 10 ఫీట్లు ఉండగా సదరుమడిగే ముందర రోడ్డు జాగాను 10 నుంచి 15 సీట్లు ఆక్రమించుకున్నట్లే ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి దుకాణం బంద్ చేసే వరకు తమ దుకాణ సంబంధిత సామాగ్రిని ఇతరత్రా వాటిని రోడ్డు భాగం పై పెట్టేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

నిర్మల్‌లోని ప్రధాన అంతర్గత రోడ్లు 50 నుంచి 20 ఫీట్ల మేర వెడల్పే ఉండగా ఆ పార్టీలో ఈ తరహ జాగ ఆక్రమణలు చేసుకుంటూ రోడ్డుపై వ్యాపారాలు చేస్తున్నాడు పాదచారులు,వాహన చోదలకు అవస్థలకు గురిచేస్తుంది. అనుకోకుండా ఈ రహదారులపై భారీ వాహనము వచ్చేస్తే గంటల తరబడి వాహన చోదకులు పాదచారులు ఇబ్బందులకు గురి కాక తప్పడం లేదు. వీటికి తోడు నిర్మల్ పట్టణంలోని ప్రధాన అంతర్గత వీధులలో ఎక్కడపడితే అక్కడ పండ్ల వ్యాపారాలు కూరగాయలు చాట్ బండ్లు కుప్పలకు కుప్పలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నాడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఒక్కొక్క సందర్భంలోనైతే పట్టణంలోని ప్రధాన చౌరస్తాలైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌక్, ఈద్గాం చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, వివేకానంద చౌరస్తా, పింజారి గుట్ట చౌరస్తాలలో రోజువారి సాధారణ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా జిల్లా పోలీస్ పురపాలక శాఖ యంత్రాంగం ఈ విషయంలో తగిన చొరవ తీసుకొని ఆక్రమాలకు గురవుతున్న ప్రధాన అంతర్గత రోడ్ల నుండి సదరు చెరువు వ్యాపారాలను దుకాణ యజమానుల సామాగ్రిని తొలగించి సదరు రోడ్లు సరిగా ఉండి వాహన చోదకులు పాదచారులు సరిగా అడ్డుకుండా తమ ప్రయాణాలను కొనసాగించేలా చూస్తారని పట్టణవాసులు వేడుకుంటున్నారు.

Spread the love

Related News

Latest News