Trending Now

జిల్లా ఆరోగ్య కేంద్రానికి విద్యుత్తు నిలిపివేత.. ఇబ్బందుల్లో రోగులు

ప్రతిపక్షం, దుబ్బాక మార్చి 28: సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి సంబంధించిన విద్యుత్ బకాయి బిల్లును ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అధికారులు చెల్లించకపోవడంతో విద్యుత్తు అధికారుల ఆదేశాల మేరకు గత కొన్ని నెలలుగా విద్యుత్తు సిబ్బంది ఆసుపత్రి కి విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. దీంతో వైద్యం కోసం వెళ్ళిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం హబ్సిపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి సంబంధించిన విద్యుత్ శాఖకు బకాయి ఉన్న సుమారు 23 వేల రూపాయల బిల్లు చెల్లించక పోవడంతో విద్యుత్ అధికారులు గత నెలలుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం స్థానిక ఆరోగ్య ఉప కేంద్రంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతతో, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్తు శాఖకు బకాయి ఉన్న కరెంట్ బిల్లును వెంటనే చెల్లించి విద్యుత్ సరఫరా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. కొన్ని నెలలుగా ఆసుపత్రిలో విద్యుత్ సమస్య గురించి పట్టించుకోని ప్రభుత్వ వైద్య సిబ్బందిపై తగుచర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love