ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయన్నారు. ఈ నెల 13వ తేదీన తెలంగాణ లో ఎన్నికలు జరగనున్నాయని.. రేపు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ నగరం ఎల్బీ స్టేడియం నుంచి ప్రధాని మోదీ గారు సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. రేపు పార్టీ కార్యకర్తలు.. యువత ఎల్బీ స్టేడియంకు రావాలనీ పిలుపునిచ్చారు. బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు తమ బూత్ లలో నుంచి ప్రజలతో పాటు కలిసి రావాలి సామూహికంగా వచ్చి సభలో పాల్గొనాలని తెలిపారు. తెలంగాణలో రేపటి సభతో మోడీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.. కాబట్టి ఎల్లుండి మహిళా మోర్చల తరుఫున అందరు డోర్ టూ డోర్ ప్రచారం చేయాలని సూచించారు. విశ్వాసంతో ముందుకు వెళ్లాలి.. రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయన్నారు.
గతంలో బలం లేని నియోజకవర్గాల్లో సైతం ప్రస్తుతం ప్రజల మద్దతు లభిస్తుంది బలం పెరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా సెకండ్ ప్లేస్ కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొట్లాడుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలిరావాలన్నారు. బీజేపీ ని మోదీని ఆశీర్వదించండి నన్ను గెలిపించండి అని పిలుపునిచ్చారు.