ఒక్కొక్కరు బీఆర్ఎస్కు గుడ్‌బై
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి ఒక్కొక్కరు గుడ్‌భై చెబుతున్నారు. ఆదివారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అవడం నుంచి బీఆర్ఎస్ బిగ్‌బాస్ కోలుకునే లోపే మంగళవారంనాడు చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, అలాగే వికారాబాద్జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో పాటు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే! అయితే చేవేళ్ల లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనేతలపై కాంగ్రెస్ ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోంది. ఈ ఆకర్ష్ మంత్రానికి ఎవరెవరు ఆకర్షితులవుతారో వేచిచూడాల్సిందే మరీ!