ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం

ప్రతిపక్షం, జూన్ 04: ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన రాజకీయ వైఖరిలో స్పష్టత లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Spread the love

Related News

Latest News