ప్రతిపక్షం, జూలై 14: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను ప్రభుత్వం దశలవారీగా సాకారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇళ్ల మంజూరు నుంచి గృహప్రవేశాల వరకు లబ్ధిదారులు తమ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తొలి దశలో 4.5 లక్షల ఇళ్లు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల చిరునవ్వులే తమకు లభించే గొప్ప గుర్తింపు అని మంత్రి పేర్కొన్నారు.


















