Trending Now

బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుంది..

సీపీఐ, సీపీఎం జిల్లా సదస్సులో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు..

ప్రతిపక్షం, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 15: కార్పొరేట్‌ శక్తులతో జతకట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమలని, మతోన్మాద కార్పొరేట్ విధానాల వల్ల బీజేపీ పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ లు అన్నారు. ఈరోజు సీపీఎం జిల్లా కార్యాలయం kk భవన్లో నిర్వహించిన సీపీఐ సీపీఎం జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేకనే మతరాజకీయాలకు పాల్పడుతున్నాడని అన్నారు. ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్లు కుంభకోణానికి పాల్పడిన బీజేపీ ఈ విషయాలను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. చివరికి మీడియాను సైతం బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకుందని, ఇది ప్రజాస్వామ్యానికి అంత్యంత ప్రమాదకరమని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థలకు పెనుప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండతో దేశ, విదేశీ బడా కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టారన్నారు. గత పదేళ్లలో అంతకు పదిరేట్ల వరకు ఎన్నికల బాండ్లు తదితర రూపాల్లో కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రజాస్వామ్య కల్గిన మన దేశంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.

గతంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యానికి ఎన్నికల బాండ్లు విఘాతం కలిగిస్తాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ధరలు, నిరుద్యోగం పెరిగిపోతుందని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మానిక్, నర్సింలు, యాదగిరి, అశోక్, కృష్ణ, రమేష్, మహేష్, సంతోష్, సురేష్, సీపీఐ నాయకులు రహమాన్, ఆనంద్, తాజుద్దీన్ మహబూబ్ ఖాన్, లక్ష్మీ, రుబిన,శంకరప్ప చిరంజీవి తది తరులు పాల్గొన్నారు.

Spread the love

Related News