Trending Now

India Declare Second Innings: పంత్, గిల్ సెంచరీలు.. భారత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌

After Pant, Gill’s Tons India Declare Second Innings: చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. రిషభ్‌ పంత్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లింది. రెండో రోజు రిషభ్‌ పంత్ (109), శుభ్‌మన్‌ గిల్ (119) సెంచరీలు చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం చేశారు. పంత్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ (22) దూకుడుగా ఆడాడు. దీంతో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్, రానా చెరో వికెట్ తీయగా.. మిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, బంగ్లాదేశ్‌‌కు 515 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించింది. అయితే ఇంకా రెండు రోజులు మిగిలున్నప్పటికీ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌ గెలవడంతో పాటు డ్రా చేసుకోవడం కష్టమేనని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Spread the love

Related News

Latest News