ప్రతిపక్షం, జూలై 08: హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం, బోరబండ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెతో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ, అనుచితంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా చంపేస్తానంటూ బాధితురాలిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన గురించి తల్లికి తెలియడంతో ఆమె కూడా నిందితుడిని ప్రశ్నించగా, ఆమెను సైతం బెదిరించినట్లు సమాచారం. దీంతో బాధితురాలి తల్లి బోరబండ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు ఇతర నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

















