ప్రతిపక్షం, ఆగస్టు 13, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేడు కూకట్‌పల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లకు సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
కేపీహెచ్‌బీలోని 5.87 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు. మొత్తం రూ.43 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో 480 ఇళ్లను, రెండో దశలో మరో 680 ఇళ్లను నిర్మించనున్నారు. మొత్తం 1,160 ఇళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
సీఎం పర్యటన సందర్భంగా కార్యక్రమ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 300 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకపోకలు, కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.





























