[t4b-ticker]

సీఎం సోదరుడికి భూ కేటాయింపు ఆరోపణల్లో నిజం లేదు: శ్రీధర్‌బాబు

ప్రతిపక్షం, ఆగస్టు 11: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి తక్కువ ధరకే భూములు కేటాయించారన్న ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా ఖండించారు. భూ కేటాయింపు ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు.

రావిర్యాలలో టెస్సెరాక్ట్‌ సంస్థకు భూముల కేటాయింపుపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి తెలిపారు. సంబంధిత సంస్థతో సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.

మరోవైపు రాయదుర్గంలో నిర్మించనున్న పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను కూడా శ్రీధర్‌బాబు ఖండించారు. టెండర్‌ ప్రక్రియలో నిబంధనలను పాటించామని, ఎలాంటి అక్రమాలకు తావులేదని తెలిపారు.

భూముల కేటాయింపు, టెండర్ల అంశాలపై బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ చేస్తున్న ఆరోపణలను మంత్రి తప్పుబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్‌ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News