పార్టీ మారను.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా: మల్లారెడ్డి

ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారానికి చెక్ పెడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడబోనని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని తెలిపారు.

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి, కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కేటీఆర్ 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేయాలి” అని ఆకాంక్షించారు.

ఇటీవల తనకు ఓ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం తీవ్రంగా కలచివేసిందని మల్లారెడ్డి తెలిపారు. పార్టీపై, నాయకత్వంపై కార్యకర్తలు చూపుతున్న ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని అన్నారు. ఆ లేఖ రాసిన కార్యకర్తను త్వరలోనే వ్యక్తిగతంగా కలిసి పరామర్శిస్తానని చెప్పారు.

ఇటీవల తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని మరోసారి ఖండించిన ఆయన, బీఆర్‌ఎస్‌పైనే తనకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ బలోపేతం కోసం కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spread the love

Related News

Latest News