ప్రతిపక్షం స్టేట్బ్యూరో: హైదరాబాద్, మార్చి 26: రైతు సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్ట్ లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌నేత, ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో రైతులకు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు సమయం, తేదీ, వేదిక ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో మంగళవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు.
పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో ఖండించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ అధికారంలో వర్షాలు, వడగండ్ల వాన వల్ల ఎన్ని పర్యాయాలు పంట నష్టం జరిగితే, మీరు ఎన్ని మార్లు పరిహారం చెల్లించారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ప్పుడు సమస్యలు పట్టించుకోకుండా కేవలం అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌పార్టీ ఏం చేసిందో, మీరు ఏమి చేశారో సిద్ధిపేట వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా..? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని పదేళ్లపాటు పందికొక్కుల్లా దోచుకున్నారని, అవి ఒక్కొక్కటిగా బయటపడుతుంటే బెంబేలెత్తి , ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు సీనిమా ముందుందని, అనినీతి అక్రమాలు భయటపడతున్నాయని, మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. గత పదేళ్లలో రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ చేతలు ముట్టడించి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కొత్తగా వచ్చిన మా ప్రభుత్వానికి చిప్ప ఇచ్చారని, అయినా కూడా ఆర్థిక క్రమశిక్షణతో ఒక్కొక్క హామీ అమలు చేస్తూ ముందుకు పోతున్నామన్నారు.
అధికారం పోయి మూడుమాసాలు అయినా ఓపిక లేకుండా ఉందని, అధికార దాహం కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల లబ్ధికోసమే హరీశ్‌రావు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఈ పరిస్థితి వచ్చేదా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వల్ల కోట్లాది రూపాయలు దండుకొని నాణ్యత లేకుండా నిర్మించారని, ఇప్పుడు వాటిలో నీళ్లులేక వృధాగా ఉన్నాయన్నిరు.అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనని స్పష్టం చేశారు.
పంట నష్టంపై సీయం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, పంట నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. చిప్ప చేతికి ఇచ్చి వెళ్ళిపోయారని, అయినా సీయం రేవంత్ రెడ్డి సారద్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పుతారని అన్నారు. ఉమ్మడి పాలమూర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు.
హరీశ్ ఆర్థిక నేరగాడు..
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు పెద్ద ఆర్థిక నేరగాడని షాద్నగర్ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లేకుండా ఉన్నాయని, పాలమూరు ప్రాజెక్టు అని చెప్పి డబ్బులు దోచుకున్నారంటూ ధ్వజమెత్తారు. తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. అయిదు లిఫ్టులు, 6 రిజర్వాయర్లు అని ప్రకటించారని, ఎక్కడ ఉన్నాయని ఆయన నిలదీశారు. హరీశ్‌రావు ఎందుకు సచివాలయాన్ని ముట్టడిస్తారంటూ శంకర్ ప్రశ్నించారు. మిర్చీ రైతులకు ఏడీలు వేసినందుకా, నేరెళ్లలో రైతులను చంపినందుకా, దక్షిణ తెలంగాణాను నష్టం చేసినందుకా, పాలమూరు పేరుతో పార్టీ ఎమ్మెల్యేలు ధనవంతులయ్యారని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారన్నారు. మీ మరదలు కవితమ్మ జైలుకు వెళ్లిందని త్వరలోనే మీ ఇళ్లను పోలీసులు ముట్టడిస్తారు రెడీగా ఉండాలని హెచ్చరించారు. మీది దుర్మార్గుల కుటుంబం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నివేదిక రాగానే రైతులకు ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహానం చెల్లిస్తామని, వచ్చే వాన కాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అన్నదాతల కష్టాలు, కడగండ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగలేదని, గత పదేండ్లలో 6, 651 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.