ప్రతిపక్షం, జూన్ 29: భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు దేశాన్ని గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. విదేశీ మారక నిల్వలు క్షీణించి, దేశం ఆర్థికంగా దివాలా అంచుకు చేరుకున్న వేళ ఆయన దూరదృష్టితో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో కలిసి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేసి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చారు. ఈ సంస్కరణల ఫలితంగానే విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ కంపెనీలు దేశంలోకి భారీగా వచ్చాయి. తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు, తెలుగు నేల నుంచి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాయకుడిగా చరిత్రలో నిలిచారు.

















