[t4b-ticker]

మోదీ ఫొటోతోనే రేషన్ కార్డులు ఇవ్వాలి: రఘునందన్ రావు

ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో లేకుండా పంపిణీ చేస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

రేపటి నుంచి చేపట్టనున్న రేషన్ కార్డుల పంపిణీని వెంటనే నిలిపివేయాలని, ప్రధాని మోదీ ఫొటోను కార్డులపై ముద్రించిన తర్వాతే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం ఇస్తున్నందుకు రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలు పెట్టుకున్నారని రఘునందన్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం అందిస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఫొటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

కేంద్రం, రాష్ట్రం కలిసి అందిస్తున్న రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటాను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఫొటో లేకుండా రేషన్ కార్డుల పంపిణీ కొనసాగిస్తే ప్రజల తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News